ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని సీఎం చంద్రబాబు అభినందించారు. విద్య, వైద్యం, తలసేమియా చిన్నారులకు రక్తదానం వంటి సేవలలో ట్రస్ట్ సాటిలేని ముద్ర వేసిందని ఆయన కొనియాడారు.
అన్నగారి ఆశయాల బాటలో పేదలకు అండగా నిలుస్తున్న భువనేశ్వరి బృందం కృషి అమోఘమని, ఈ సేవా ప్రస్థానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
