మదనపల్లెలో బాలిక హత్యపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని విమర్శించింది.
నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందని ఆరోపించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, మహిళా భద్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.










