బాపట్ల జిల్లాలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల డీఎస్పీ ఎం.డి.మోయిన్, భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
సూర్యపల్లి కేదారేశ్వర స్వామి దేవస్థానం వద్ద తప్పిపోయిన పిల్లలను పోలీసులు నిమిషాల వ్యవధిలో గుర్తించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పిల్లలను అప్పగించిన పోలీసులను భక్తులు మరియు తల్లిదండ్రులు అభినందించారు.
#Narendra










