పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కోటూరులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైతు దొరస్వామికి చెందిన వరిగడ్డివామి మంటల్లో కాలిపోయింది.
గుర్తుతెలియని వ్యక్తులు ధూమపానం చేసి పారవేసిన సిగరెట్ ముక్కల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశారు. గడ్డివామి కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. వేసవిలో నిప్పుతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.










