బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు.
బాధితులకు అండగా నిలవడంలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని, సభ్యత్వ నమోదులో జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
బ్లడ్ బ్యాంక్, పేదలకు ఉచిత భోజన సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనియాడారు. తీర ప్రాంత గ్రామాల్లో సేవలను మరింత విస్తరింపజేసేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
#Narendra









