మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి రిషిక ప్రియ హత్య అత్యంత దారుణమని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కల్యాణ్ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
చౌడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
# కొత్తూరు మురళి .










