ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది.
ఈ భేటీలో రూ. 29,021 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు (SIPB) ఆమోదముద్ర వేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని సీఎస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.










