అరట్లకట్ట నుండి విక్టోరియా వాటర్ వర్క్స్ వెళ్లే ప్రధాన పైపులైన్ మరమ్మతుల కారణంగా, నగరంలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఈ పి. వెంకట్రావు ప్రకటించారు.
ఫిబ్రవరి 20 సాయంత్రం నుండి 21 ఉదయం వరకు 5, 6, 16, 49 డివిజన్లలో అంతరాయం కలగనుంది. పైపులైన్ లీకేజీల అరికట్టడం అత్యవసరమని, ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని సహకరించాలని అధికారులు కోరారు.










