Home South Zone Telangana ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|

ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి  వేడుకలు అల్వాల్‌ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, శివ భక్తులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం పరాయి పాలనలో మగ్గిపోతున్న సమయంలో ధైర్యసాహసాలతో ‘స్వరాజ్యాన్ని’ స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ అని కొనియాడారు. కేవలం యుద్ధ తంత్రంలోనే కాకుండా, ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పరిపాలన అందించిన మహనీయుడని పేర్కొన్నారు. నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని, దేశభక్తితో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో  మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్. మేడ్చల్ జిల్లా అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి,   డివిజన్ ల ప్రసిడెంట్ లు, కార్తిక్ గౌడ్. శ్రీదర్ రెడ్డి. అజయ్ రెడ్డి. తూప్రాన్ లక్ష్మణ్. అనిల్. కరుణశ్రీ. సుజాత.రవి కిరణ్. రాజేంద్రప్రసాద్. మరియు బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version