మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పారదర్శకతతో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహసిల్దార్ మరియు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
