వృద్ధాశ్రమానికి ₹50 లక్షల విరాళం ప్రకటించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

0
0

కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. పెద్దాపురం మహారాణి కళాశాల సమీపంలో నిర్మిస్తున్న ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి ₹50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

సోమవారం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, నిరాశ్రయులైన వృద్ధులకు ఈ ఆశ్రమం కొండంత భరోసాగా నిలవాలని ఆకాంక్షించారు. ఆధునిక సదుపాయాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.