సదుంలోని ఐఓబి బ్యాంకులో రత్నమ్మ అనే మహిళ నగదు డ్రా చేస్తుండగా, సాయం చేస్తానంటూ వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బురిడీ కొట్టించాడు. నోట్లు లెక్కిస్తున్నట్లు నటించి, ఒక నోటు చినిగిందని చెప్పి మార్చుకోమన్నాడు.
ఆమె తిరిగి తీసుకున్నప్పుడు అందులో ₹19 వేలు తక్కువగా ఉన్నాయి. నిందితుడిని సీసీ కెమెరా దృశ్యాల ద్వారా గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల్లో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
# కొత్తూరు మురళి.
