మదనపల్లెలో బైక్-ఆటో ఢీ: చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు

0
0

మదనపల్లెలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి టి. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. తన ద్విచక్ర వాహనంపై గురుకుల పాఠశాల రోడ్డు గుండా వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.