మదనపల్లె రాస్తారోకో: 30 మందికి పోలీసుల నోటీసులు

0
0

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో చేపట్టిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర 41 సెక్షన్ నోటీసులు జారీ చేశారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులు, ట్రాఫిక్‌కు మరియు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిరసనకారులను గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.