రిషిక ప్రియ కేసు: ఏ2 అంజలి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు

0
1

మదనపల్లె చిన్నారి రిషిక ప్రియ హత్య కేసులో ఏ2 నిందితురాలు అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఇంట్లోని కీలక సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఎస్పీ దీరజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

హత్య సమాచారాన్ని దాచడం, ఆధారాలు చెరిపివేసేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై అంజలిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు.