పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం కందూరు-చౌడేపల్లి రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారు చౌడేపల్లి మండలానికి చెందిన వారని గుర్తించిన స్థానికులు, వెంటనే వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
# కొత్తూరు మురళి .










