Home South Zone Telangana ఉచిత పోటీ పరీక్షల శిక్షణ: రేపే దరఖాస్తుకు ఆఖరి గడువు

ఉచిత పోటీ పరీక్షల శిక్షణ: రేపే దరఖాస్తుకు ఆఖరి గడువు

0

మెదక్ జిల్లాలోని TG SC స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, SI, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు 5 నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఫిబ్రవరి 22 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికైన 100 మందికి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఉంటుంది. మార్చి 1న ఉదయం 11 గంటలకు ‘ప్రతిభ డిగ్రీ కళాశాల’లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version