అమరావతి నుంచి నిర్వహించిన రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. పీఎం సూర్య ఘర్ (ఉచిత విద్యుత్), పీఎం కుసుం (సోలార్ పంపుసెట్లు) పథకాల అమలు పురోగతిని ఆయన సమీక్షించారు.
సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మునిసిపల్ సేవలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మరియు ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.










