విశాఖలో వాటర్ ట్యాంకర్ బోల్తా: కలెక్టర్ ఆఫీస్ వద్ద నిలిచిన ట్రాఫిక్

0
0

విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద వాటర్ ట్యాంకర్ ప్రమాదానికి గురవ్వడంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. బీచ్‌లోని బోట్లకు నీరు సరఫరా చేసేందుకు వెళ్తుండగా, వాహనం ఇరుసు విరిగి రోడ్డుపైనే ఉండిపోయింది.

ట్యాంకర్‌లోని నీరంతా రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్ సత్యనారాయణ సమక్షంలో మెకానిక్ వచ్చి వాహనాన్ని మరమ్మతు చేయడంతో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది.