అన్నమయ్య జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ (RIO) తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు స్పష్టం చేశారు.










