ఆటో డ్రైవర్ నిజాయితీ: మహిళకు తిరిగి చేరిన మూడున్నర సవర్ల తాళిబొట్టు

0
0

చీరాలలో ఆటో డ్రైవర్ మొగిలి రాజు అరుదైన నిజాయితీని చాటుకున్నారు. ఆటోలో ప్రయాణించిన జంగిలి లక్ష్మి అనే మహిళ తన మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టును పొరపాటున ఆటోలోనే వదిలేశారు.

ఆ సొమ్మును గుర్తించిన రాజు, వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. సీఐ సుబ్బారావు సమక్షంలో ఆధారాలు పరిశీలించి ఆ బంగారాన్ని బాధితురాలికి అందజేశారు.

పరాయి సొమ్ముకు ఆశపడకుండా బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌ను పోలీసులు, స్థానికులు అభినందించారు.

#Narendra