Home South Zone Andhra Pradesh శ్రీకాళహస్తిలో విదేశీ భక్తుల సందడి |

శ్రీకాళహస్తిలో విదేశీ భక్తుల సందడి |

0

రష్యా, జర్మనీ దేశాలకు చెందిన 200 మంది భక్తులు శనివారం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన వీరు శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ అధికారులు వీరికి ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం విదేశీయులు ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల వారు తమ గౌరవాన్ని చాటుకున్నారు.

NO COMMENTS

Exit mobile version