హెరిటేజ్‌పై దుష్ప్రచారం ఆపాలి: వైసీపీకి టీడీపీ నాయకుడు గురునాథం హెచ్చరిక

0
1

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాయకులు హెరిటేజ్ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం మండిపడ్డారు.

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ హైకోర్టు మందలించినా వైసీపీకి బుద్ధి రాలేదని, రాజకీయ లబ్ధి కోసం నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న సంస్థపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.

నాణ్యతకు మారుపేరైన హెరిటేజ్‌పై అసత్య ప్రచారాలు చేస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా తప్పదని ఆయన హెచ్చరించారు.