తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న (శనివారం) ఒక్కరోజే 82,043 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లుగా నమోదైంది.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, క్యూలైన్లు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోంది.
ఎండల తీవ్రత దృష్ట్యా టీటీడీ భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తోంది.










