రాష్ట్రంలోని దేవాలయాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్యా రెడ్డి స్పష్టం చేశారు.
రాయచోటి నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత నియోజకవర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.










