అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షల దృష్ట్యా 144 సెక్షన్ విధింపు

0
0

అన్నమయ్య జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షలు జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.