నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం |

0
0

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రసాద పంపిణీకి శ్రీకారం చుట్టారు.

స్థానిక మిద్దె సెంటర్ వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, వంటకాల తయారీని ప్రారంభించారు.

స్వామివారి పెళ్లి కుమారుని ఉత్సవం నుండి రథోత్సవం వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు.