Home South Zone Telangana పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు: మాతృభాష దినోత్సవ వేడుకలు

పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు: మాతృభాష దినోత్సవ వేడుకలు

0

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారివేంపల్లి పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన పద్యాల పోటీల్లో విద్యార్థులు శతక పద్యాలను అనర్గళంగా ఆలపించి ప్రతిభ చాటారు. మాతృభాషతోనే సృజనాత్మకత పెరుగుతుందని ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ పేర్కొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేసి, తెలుగు భాషా గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణా రెడ్డి, భారతి పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version