శాసన మండలిలో శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డులుగా వాడుతూ వైసీపీ ఎమ్మెల్సీలు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మండిపడ్డారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
పవిత్రమైన చిత్రపటాలను రాజకీయ నిరసనలకు ఉపయోగించి, వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడం క్షమించరాని నేరమని విమర్శించారు. వైసీపీ నేతలు తక్షణమే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ నేత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.










