రాయచోటి రూరల్ మండలం చిన్నముక్కపల్లె గ్రామంలో ‘మై టీడీపీ’ (My TDP) పోస్టర్ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్యా రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐటీడీపీ (iTDP) కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, బెంగుళూరు మధుబాబు తదితర నాయకులు పాల్గొని పార్టీ బలోపేతానికి పిలుపునిచ్చారు.










