నిజామాబాద్ జిల్లా గాయత్రీ నగర్లో శ్రీ గాయత్రీ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సుమిత్రా కిషోర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఆడెపు నరేంద్రస్వామి మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధిలో సుమిత్ర గారు చూపుతున్న చొరవ, ఆమె మంచితనమే ఆమెను మళ్ళీ విజయపథంలో నిలిపాయని కొనియాడారు.
భవిష్యత్తులో కూడా డివిజన్ను మరింత అభివృద్ధి చేయాలని కోరుతూ కమిటీ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.









