రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశిస్తూనే, ఘటనపై పూర్తి నివేదిక కోరారు. విశాఖ ల్యాబ్ నుంచి నివేదికలు రాగానే బాధ్యులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
ఇప్పటికే విక్రేతను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు.
