కేతనపల్లెలో మామిడి తోటలో అగ్నిప్రమాదం

0
0

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కేతనపల్లెలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు రూ. 25 వేల విలువైన చెట్లు కాలిబూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, సిబ్బందితో కలిసి వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో భారీ ఆస్తి నష్టం తప్పిందని తోట యజమాని ఊపిరి పీల్చుకున్నారు.