అనకాపల్లి నూకాంభిక అమ్మవారికి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు దేవస్థానం బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 13న (శుక్రవారం) రాష్ట్ర, జిల్లా పద్మశాలి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించనున్నారు.
ఇకపై ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని నేతలు వెల్లడించారు. భక్తులు తమ గోత్ర నామాలను ముందుగానే నమోదు చేసుకోవాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు కోరారు.










