Home South Zone Andhra Pradesh మదనపల్లెలో దారుణం: మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కొడుకు దాడి

మదనపల్లెలో దారుణం: మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కొడుకు దాడి

0

మదనపల్లె సీటీఎం క్రాస్ రోడ్డులో మద్యం మత్తులో ఓ కుమారుడు కన్న తల్లిదండ్రులపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. సెలూన్ షాపు నిర్వహిస్తున్న నిందితుడు, మద్యం కోసం డబ్బులు అడగ్గా వారు నిరాకరించడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నవారిపైనే కుమారుడు దాడి చేయడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version