ఉంగుటూరు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పెను సంచలనం నమోదైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీలో పనిచేసిన ఆయన, రఘురామను హింసించారనే ఫిర్యాదుపై దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సునీల్ నాయక్ తిరిగి బీహార్ కేడర్‌కు వెళ్లిపోగా, తాజాగా పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.









