రామసముద్రం మండలంలో 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.









