Home South Zone Andhra Pradesh ఇల్లు కట్టుకోనివ్వడం లేదు.. కలెక్టర్ ముందు మహిళ కన్నీటి పర్యంతం

ఇల్లు కట్టుకోనివ్వడం లేదు.. కలెక్టర్ ముందు మహిళ కన్నీటి పర్యంతం

0

విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన కల్లుపల్లి లత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో తన గోడును వెళ్లబోసుకున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే సింహాచలం దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త పక్షవాతంతో బాధపడుతున్నారని, ఒకవైపు కుటుంబ భారం, మరోవైపు ఇల్లు కట్టుకోలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

NO COMMENTS

Exit mobile version