Home South Zone Andhra Pradesh తోటవారిపాలెంలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

తోటవారిపాలెంలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

0

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు, టీడీపీ నేతలు హాజరయ్యారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version