Home South Zone Andhra Pradesh పారితోషికం వద్దు.. వేతనమే ముద్దు: మదనపల్లెలో అంగన్‌వాడీల రిలే దీక్షలు

పారితోషికం వద్దు.. వేతనమే ముద్దు: మదనపల్లెలో అంగన్‌వాడీల రిలే దీక్షలు

0

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, గౌరవప్రదమైన వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలో అంగన్‌వాడీలు గర్జించారు.

సోమవారం అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

“పారితోషికం వద్దు.. ప్రభుత్వ వేతనమే ముద్దు” అంటూ నినదించారు. ఈ పోరాటానికి ఐద్వా (AIDWA) ప్రతినిధులు మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version