మంత్రి సత్యకుమార్ చొరవ.. కదిరి యువకుడికి గుండె మార్పిడితో పునర్జన్మ

0
0

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చూపిన మానవత్వంతో కదిరికి చెందిన చరణ్ కుమార్ అనే యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి జరిగింది.

బెంగళూరులోని దేహీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, ఆపరేషన్‌కు మంత్రి మార్గం సుగమం చేశారు. మరోవైపు, రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.