పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మండల వైద్యాధికారి జయసింహ, హెల్త్ ఎడ్యుకేటర్ రఫీ మాట్లాడుతూ.. ‘భేటీ బచావో-భేటీ పడావో’ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్య బృందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
# కొత్తూరు మురళి.










