రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ప్రకటించారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని, అవసరమైన ల్యాబ్‌లు, పోటీ పరీక్షల మెటీరియల్‌ను సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యాశాఖ దెబ్బతిందని విమర్శిస్తూనే, విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామని వెల్లడించారు.
