మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఆలయ తలుపులు పగులగొట్టి, సుమారు 3 కేజీల వెండి కిరీటాలు, బంగారు తాళిబొట్లు, శంకు చక్రాలు, హుండీ నగదును అపహరించారు.
వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నారు.
