ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చేనేత రంగంపై మంత్రి ఎస్.సవిత కీలక ప్రకటనలు చేశారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్, చీరాల క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఆప్కో వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో పక్కదారి పట్టిన ఆప్కో నిధులను వెలికితీసి, సంస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ఆమె స్పష్టం చేశారు.









