అన్నమయ్య జిల్లా రాయచోటిలో జనసేన సీనియర్ నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బుడ్డా నాగభూషణ్ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు.
