రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే

0
0

తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, వాటి మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన బుధవారం అసెంబ్లీలో కోరారు.

గత ప్రభుత్వ హయాంలో పీఆర్ (PR) రోడ్లను ఆర్ అండ్ బీ (R&B) లో విలీనం చేసినా, నిధుల ప్రతిపాదనలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు.