మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను 267 మంది పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు.
అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) తొలి సమావేశంలో ఆమోదం పొందిన వారికి ఈ కార్డులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
అర్హత కలిగిన మిగిలిన దరఖాస్తుదారులకు తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.










