ఏపీలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘క్లస్టర్ బేస్డ్’ అభివృద్ధి విధానాన్ని పట్టాలెక్కించింది.
రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించి, ఆయా ప్రాంతాల అనుకూలతను బట్టి పరిశ్రమలను ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది.
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, రాయలసీమలో ఆటోమోటివ్, ఉత్తరాంధ్రలో ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేయనున్నారు.










