రాయచోటి మండలం గుండ్ల చెరువు గ్రామ కస్పాలో నూతనంగా నిర్మించనున్న సీతారామాలయానికి రూ. 31 లక్షల వ్యయంతో భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
